గంగుల ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లిన నటుడు తారకరత్న!

11-10-2020 Sun 08:05
Hero Tarakaratna met Gangula Prabhakarreddy
  • సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చిన తారకరత్న
  • ముగిసిన తరువాత తిరుగు ప్రయాణంలో గంగుల ఇంటికి
  • ఎమ్మెల్యే బిజేంద్రా రెడ్డితోనూ భేటీ

టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న, ఏపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డిని తన నివాసంలో కలిశారు. ఇటీవల ఏపీలో సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు మండలంలోని గండికోటలో తన తాజా చిత్రం షూటింగ్ నిమిత్తం వచ్చిన తారకరత్న, షూటింగ్ ముగిసిన తరువాత, గంగుల ఇంటికి వెళ్లారు.

పట్టణ వైసీపీ నేత గిరిధర్ రెడ్డితో కలిసి హైదరాబాద్ కు తిరిగి వెళుతూ మార్గమధ్యంలో ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఆయన వెళ్లారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డితోనూ తారకరత్న భేటీ అయ్యారు. అంతకుముందు గంగుల దంపతులు అహోబిలానికి వెళ్లి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని వచ్చారు.