బ్యాంకాక్ లో విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్!

10-10-2020 Sat 21:27
Vijay Devarakondas film shoot in Bangkok
  • పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సినిమా 
  • లాక్ డౌన్ కి ముందు ముంబైలో షూటింగ్
  • త్వరలో యూనిట్ బ్యాంకాక్ పయనం
  • తెలుగు, హిందీ భాషల్లో నిర్మాణం   

ఆర్నెల్ల తర్వాత ఇటీవలే మళ్లీ టాలీవుడ్ లో సినిమాల షూటింగులు మొదలయ్యాయి. కొందరు స్టార్ హీరోలు కూడా హైదరాబాదులో తమ సినిమాల షూటింగుల్లో పాల్గొంటున్నారు. మరికొందరు అవుట్ డోర్ షూటింగులకు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్, పూజ హెగ్డే కలసి 'రాధే శ్యామ్' సినిమా కోసం ఇటలీలో షూటింగ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కూడా తన సినిమా షూటింగుకి రెడీ అవుతున్నాడు. విజయ్ తన తాజా చిత్రాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి విదితమే. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందు చాలా వరకు ముంబైలో జరిగింది.

ఇక ఈ చిత్రం షూటింగును త్వరలోనే విదేశాలలో నిర్వహిస్తారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడీ చిత్రం షూటింగును దర్శకుడు పూరి తన ఫేవరైట్ కంట్రీ బ్యాంకాక్ లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఛార్మి, కరణ్ జొహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది.