Rajasthan: సజీవ దహనానికి గురైన పురోహితుడి అంత్యక్రియలు పూర్తి

  • రాజస్థాన్ లో ని కరౌలి జిల్లాలో దారుణం
  • స్థల వివాదం నేపథ్యంలో పురోహితుడిని సజీవ దహనం చేసిన వైనం
  • కుటుంబసభ్యులు అంగీకరించడంతో అంత్యక్రియలు పూర్తి
Priest who burnt alive cremated

స్థల వివాదం నేపథ్యంలో రాజస్థాన్ కు చెందిన ఒక పురోహితుడిని కొందరు వ్యక్తులు గురువారం సాయంత్రం సజీవదహనం చేశారు. ఆయన కుటుంబసభ్యులు చివరకు అంగీకరించడంతో కాసేపటి క్రితం అంత్యక్రియలను పూర్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

రూ. 50 లక్షల పరిహారంతో పాటు, కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తేనే అంత్యక్రియలకు ఒప్పుకుంటామని కుటుంబసభ్యులు పట్టుబట్టడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం కరౌలి జిల్లా సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ ఓం ప్రకాశ్ మీనా ఆగమేఘాల మీద మృతుడి గ్రామానికి వెళ్లారు. పురోహితుడు చనిపోయి ఇప్పటికే రెండు రోజులు గడిచిపోయిన నేపథ్యంలో, వెంటనే అంత్యక్రియలను నిర్వహించేందుకు కుటుంబసభ్యులు అంగీకరించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో, కుటుంబసభ్యులు తమ నిరసనను ఆపేయడంతో అంత్యక్రియలను పూర్తి చేశారు.

ఈ సందర్భంగా పురోహితుడి బంధువులు మాట్లాడుతూ, నిందితులందరినీ అరెస్ట్ చేయాలని... నిందితులకు సహకరిస్తున్న రెవెన్యూ అధికారి, పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు.

More Telugu News