గుణశేఖర్ 'శకుంతల'గా అనుష్క?

10-10-2020 Sat 16:50
Anushka to play Shakuntala role in Gunashekhars film
  • దర్శకుడు గుణశేఖర్ తాజా చిత్రం 'శాకుంతలం' 
  • అనుష్కను తీసుకోమంటూ దర్శకుడికి సందేశాలు
  • అంగీకరించమంటూ అనుష్కకు రిక్వెస్టులు  

ఆమధ్య గుణశేఖర్ దర్శకత్వంలో 'రుద్రమదేవి' చారిత్రాత్మక చిత్రాన్ని చేసి, పలువురి ప్రశంసలు అందుకున్న ప్రముఖ నటి అనుష్క మరోసారి గుణశేఖర్ దర్శకత్వంలో నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దర్శకుడు గుణశేఖర్ తన తదుపరి సినిమాగా నిన్న 'శాకుంతలం' ప్రేమకావ్యాన్ని ప్రకటించిన సంగతి విదితమే.

ఇందులో శకుంతల పాత్రకు అనుష్కను తీసుకోవాలని గుణశేఖర్ యోచిస్తున్నాడని అంటున్నారు. మరోపక్క, ఈ పాత్రకు అనుష్క ఇప్పటికే ఆమోదం కూడా తెలిపిందని మరికొందరు అంటున్నారు.

ఇదిలావుంచితే, సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రం గురించి జోరుగా చర్చ సాగుతోంది. 'శాకుంతలం' దృశ్య కావ్యానికి అనుష్క అయితేనే సరిగ్గా సరిపోతుందంటూ దర్శకుడు గుణశేఖర్ కి అభిమానులు మెసేజెస్ పెడుతున్నారు. అలాగే, అనుష్కను కూడా దీనికి అంగీకరించమని కోరుతూ రిక్వెస్టులు చేస్తున్నారు. మరి, ఇంతకీ దర్శకుడు ఈ పాత్రకి ఎవరిని ఎంపిక చేస్తున్నాడో చూడాలి!