ఏడాదిలో లక్ష కోట్లు అప్పు చేసిన విజన్ మీకే సొంతం దొంగలెక్కల విజయసాయిరెడ్డి: దేవినేని ఉమ
- పోలవరం యాత్రలకు చంద్రబాబు దుబారా చేశాడన్న విజయసాయి
- చంద్రబాబు పోలవరం 70 శాతం పూర్తిచేశాడన్న ఉమ
- జగన్ నిర్మించింది 0.6 శాతమేనని వెల్లడి
చంద్రబాబు పోలవరం 70 శాతం పూర్తిచేశారని వెల్లడించారు. కానీ 17 నెలల్లో జగన్ నిర్మించింది 0.6 శాతమే.... మీరా పోలవరం గురించి మాట్లాడేది? అని ఉమ విమర్శించారు. ఇలాంటి గోబెల్స్ ప్రచారాలు చేయడంపై పెట్టే శ్రద్ధ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడంపై పెట్టాలని హితవు పలికారు. 'ఏడాదిలో లక్ష కోట్లు అప్పు చేసిన విజన్ మీకే సొంతం దొంగలెక్కల విజయసాయిరెడ్డి!' అంటూ ఉమ ట్వీట్ చేశారు.