రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్, రాంచరణ్

10-10-2020 Sat 13:28
Jr NTR and Ram Charan greets Rajamouli on his birthday
  • ఈరోజు రాజమౌళి పుట్టిన రోజు
  • శుభాకాంక్షలు తెలియజేస్తున్న సినీ ప్రముఖులు
  • లవ్ యూ జక్కన్న అన్న జూనియర్ ఎన్టీఆర్

టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి ఈరోజు తన 47వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజమౌళితో జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్ లకు అత్యంత సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరూ సూపర్ స్టార్లుగా ఎదిగేందుకు రాజమౌళి తీసిన సూపర్ హిట్ చిత్రాలు కూడా కారణమే. ఈ నేపథ్యంలో తమ అభిమాన దర్శకుడికి వీరిద్దరూ శుభాకాంక్షలు తెలిపారు.

'వెరీ హ్యాపీ బర్త్ డే జక్కన్న. లవ్ యూ' అంటూ తారక్ ట్వీట్ చేశాడు. 'విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకునే సక్సెస్ ఆయనది. గురువు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు. లాట్స్ ఆఫ్ లవ్' అని రాంచరణ్ ట్వీట్ చేశాడు.