mike pompeo: భారత సరిహద్దుల్లో చైనా వేలాది మంది సైనికుల్ని మోహ‌రించింది: అమెరికా

  • చైనా తీరును ఖండించిన పాంపియో
  • చైనా త‌న చెడు ప్ర‌వ‌ర్త‌న‌ను బ‌య‌ట‌పెట్టిందని వ్యాఖ్య
  • క్వాడ్ దేశాల‌కు చైనాతో ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చరిక
china deployed 60000 soldiers mike pompeo

చైనా తన బుద్ధిని మార్చుకోవట్లేదు. తూర్పు లడఖ్ లో సైన్యాన్ని మోహరిస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోన్న చైనా ఓ వైపు చర్చలు జరుపుతూనే, మరోవైపు సైన్యాన్ని మోహరిస్తోంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. అమెరికా, జ‌పాన్‌, భారత్, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్న క్వాడ్ గ్రూపు సమావేశం జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో జరిగింది. భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌తోనూ పాంపియో ఈ సందర్భంగా భేటీ అయ్యారు.

అనంతరం పాంపియో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భార‌త స‌రిహ‌ద్దుల్లో చైనా దాదాపు 60 వేల మంది సైనికుల్ని మోహ‌రించిన‌ట్లు చెబుతూ, చైనా తీరును ఆయన ఖండించారు. చైనా త‌న చెడు ప్ర‌వ‌ర్త‌న‌ను బ‌య‌ట‌పెట్టిందని, క్వాడ్ దేశాల‌కు చైనాతో ప్ర‌మాదం ఉంద‌ని అన్నారు. ఇండో ప‌సిఫిక్ స‌ముద్ర ప్రాంతంలో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని తెలిపారు. భారత్‌లోని వాస్త‌వాధీన రేఖ వెంట డ్రాగన్ తీరు బాగోలేదని చెప్పారు.

More Telugu News