TRS: ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీకి 1,100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించిన కేంద్ర ప్రభుత్వం

 Centre allocated TRS Party for office building
  • న్యూఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీసు నిర్మాణం
  • స్థలం కేటాయింపుపై సీఎం కేసీఆర్ కు కేంద్రం లేఖ
  • త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్న సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో 1,100 చదరపు మీటర్ల స్థలాన్ని  టీఆర్ఎస్ పార్టీకి కేటాయించినట్టు కేంద్రం వెల్లడించింది.

ఈ మేరకు కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్యూటీ ల్యాండ్ డెవలప్ మెంట్ అధికారి దీన్ దయాళ్ టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కు ఇవాళ లేఖ రాశారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. న్యూఢిల్లీలో స్థలం కేటాయింపు ప్రక్రియ ముగిసినందున త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన జరుపుతామని వెల్లడించారు. కార్యాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేస్తామని తెలిపారు.
TRS
New Delhi
Office
Building
Centre
KCR

More Telugu News