Nizamabad: ముగిసిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్

  • 99.63 శాతం పోలింగ్ నమోదు
  • బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్
  • బరిలో ఉన్న కవిత, సుభాష్ రెడ్డి, లక్ష్మీనారాయణ
Nizamabad MLC Bye Polls completed

తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేకెత్తించిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఈ సాయంత్రం ముగిసింది. ఓవరాల్ గా 99.63 శాతం ఓటింగ్ జరిగింది. నిజామాబాద్ స్థానిక సంస్థల పరిధిలో 824 ఓట్లు ఉండగా, 821 ఓట్లు పోలైనట్టు గుర్తించారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. ఈ నెల 12న ఫలితాలు వెలువడనున్నాయి.

ఈ ఉప ఎన్నిక బరిలో కల్వకుంట్ల కవిత (టీఆర్ఎస్), లక్ష్మీనారాయణ (బీజేపీ), సుభాష్ రెడ్డి (కాంగ్రెస్) ఉన్నారు. కాగా, కరోనా సమయం కాబట్టి కొవిడ్ నియమావళికి అనుగుణంగా ఓటింగ్ నిర్వహించారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన 21 మంది కూడా ఓటు వేశారు. వారిలో అత్యధికులు పీపీఈ కిట్లు ధరించి వచ్చారు. ఇద్దరు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటేశారు.

More Telugu News