Adi Purush: ప్రభాస్ 'ఆదిపురుష్' లో శివుడి పాత్రకు మరో అగ్రహీరో!

Prabhas Adi Purush unit seeks Ajay Devgan for Lord Shiv role
  • ప్రభాస్ బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'
  • ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం
  • రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్
  • శివుడి పాత్రకు అజయ్ దేవగణ్ పేరు పరిశీలన!
అగ్రహీరో ప్రభాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. ఓం రౌత్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం టైటిల్ ప్రకటనతోనే భారీ హైప్ ఏర్పడింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఇక శివుడి పాత్రలో బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకడైన అజయ్ దేవగణ్ నటించే అవకాశాలున్నాయి. చిత్ర యూనిట్ శివుడి పాత్ర కోసం అజయ్ ని దాదాపుగా కన్ఫామ్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి రావణుడి పాత్ర కోసం మొదట అజయ్ నే సంప్రదించగా, ఆయన డేట్ల సమస్యతో సున్నితంగా తిరస్కరించారు. సైఫ్ సరేననడంతో రావణుడి పాత్రకు టిక్ మార్క్ పడింది. ఇక కీలకమైన శివుడి పాత్రకు అజయ్ అయితే సరిగ్గా సరిపోతాడని దర్శకుడు ఓం రౌత్ భావిస్తున్నారు. అజయ్ దేవగణ్, ఓం రౌత్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ ఫ్రెండ్షిప్ తోనే దర్శకుడు అజయ్ ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడట.
Adi Purush
Prabhas
Ajay Devgan
Lord Shiv

More Telugu News