Budda Venkanna: ఈ యూటర్న్ లు చూసి ఊసరవెల్లులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి: బుద్ధా

Budda Venkanna gives a fitting reply to Vijayasai Reddy
  • చంద్రబాబు ఊసరవెల్లులను సిగ్గుపడేలా చేస్తున్నారన్న విజయసాయి
  • కేసుల కోసం కాళ్లు నాకుతున్నారన్న బుద్ధా
  • ప్రజలు పాతాళంలోకి పాతేస్తారంటూ వ్యాఖ్యలు
ఊసరవెల్లుల పేరిట టీడీపీ, వైసీపీ నేతలు వాగ్బాణాలు విసురుకుంటున్నారు. రాఫెల్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందని అప్పట్లో చంద్రబాబు ప్రధాని మోదీపై దుమ్మెత్తిపోసి, ఇప్పుడదే నోటితో రాఫెల్ ఫైటర్ విమానాలతో దేశం శక్తి పెరిగిందని కొనియాడడం ఊసరవెల్లులను సిగ్గుపడేలా చేయడమేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తనదైన శైలిలో ట్వీట్ చేశారు.

కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని ఎన్నికల ముందు తొడలు చరిచి, ఇప్పుడు కేసుల కోసం మెడలు  వంచుకుని కాళ్లు నాకుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. హోదా అంశం తలుచుకుంటేనే జగన్ కు చంచలగూడ జైలు గుర్తుకొచ్చి తడిసిపోతోందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ యూటర్న్ లు చూసి ఊసరవెల్లులు ఆత్మహత్య చేసుకుంటున్నాయని బుద్ధా వ్యాఖ్యానించారు. ప్రజలు మిమ్మల్ని పాతాళం కంటే లోపల పాతేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
Budda Venkanna
Vijay Sai Reddy
Jagan
Chandrababu
Andhra Pradesh

More Telugu News