K Kavitha: కామారెడ్డి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కవిత

kavita goes kamareddy
  • కొనసాగుతున్న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
  • హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్లిన కవిత
  • ఎమ్మెల్యే గంప‌ గోవర్ధన్ తో‌ కలిసి పర్యటన
ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్‌ నుంచి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు.

ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోన్న నేపథ్యంలో కల్వకుంట్ల కవిత హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్లారు. ఆమెకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే గంప‌ గోవర్ధన్ తో‌ కలిసి స్థానికంగా పోలింగ్ జరుగుతోన్న తీరును కవిత పరిశీలించారు. అక్కడి మునిసిపల్ కార్యాలయంలోని పోలింగ్ బూతు సమీపంలో ఆమె స్థానిక ‌నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. కాగా, ఈ నెల 12న ఈ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహిస్తారు.
K Kavitha
TRS
Kamareddy District
Nizamabad District

More Telugu News