Police: యోగా నేర్చుకునేందుకు వచ్చిన యూఎస్ యువతిపై రుషీకేశ్ లో అత్యాచారం!

Us Yoga Inthusiast Raped in rushikesh
  • రుషీకేశ్ కు వచ్చిన యూఎస్ యువతి
  • బాల్కనీ నుంచి గదిలోకి వచ్చిన నిందితుడు
  • కేసును రిజిస్టర్ చేశామన్న పోలీసులు
యోగా నేర్చుకోవాలన్న ఆశతో, అమెరికా నుంచి వచ్చిన ఓ యువతి, రుషీకేశ్ లో అత్యాచారానికి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును రిజిస్టర్ చేశారు. స్టేషన్ ఇన్ చార్జ్ ఆర్కే సక్లానీ వెల్లడించిన వివరాల మేరకు, బాధితురాలు రుషీకేశ్ లో ఉంటూ యోగా నేర్చుకుంటుంటే, స్థానికంగా ఉండే అభినవ్ రాయ్ తో ఆమెకు పరిచయమైంది. యోగా పట్ల ఆమెకున్న అభిరుచిని ఆసరాగా తీసుకున్న అతను ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గదిలోకి బాల్కనీ ద్వారా ప్రవేశించిన అభినవ్ రాయ్, ఈ నెల 5న అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అంతకుముందు కూడా అతను ఆమెపై ఇదే తరహా దాష్టీకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. యోగాపై బాధితురాలికి ఉన్న ఇష్టమే అభినవ్ తో పరిచయం పెరిగేలా చేసిందని తమ విచారణలో తేలినట్టు సక్లానీ వెల్లడించారు. కాగా, తన కుమారుడిపై పెట్టిన కేసును వెనక్కు తీసుకోవాలని అభినవ్ తండ్రి తనపై ఒత్తిడి తెస్తున్నాడని యూఎస్ యువతి ఆరోపించింది.
Police
Rushikesh
Rape
US Lady
Yoga

More Telugu News