Bigg Boss: నేడు బిగ్ బాస్ వీకెండ్ పార్ట్ షూటింగ్... ఇంకా హైదరాబాదుకు రాని నాగార్జున!

Bigg Boss Weekend and Nagarjuna is not Available as off now
  • శనివారం నాటి ఎపిసోడ్ షూటింగ్ నేడు
  • థాయ్ నుంచి చార్టెడ్ ఫ్లయిట్ లో నాగ్ వస్తారని సమాచారం
  • ఇంకా వెలువడని అధికారిక ప్రకటన
టాలీవుడ్ అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ వీకెండ్ షూటింగ్ నేడు ప్రారంభం కావాల్సి వుండగా, షూటింగ్ నిమిత్తం థాయ్ లాండ్ వెళ్లిన హోస్ట్ నాగార్జున, ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. శని, ఆదివారాల్లో హౌస్ లోని పోటీదారులను పలకరించే నాగార్జున, ఆపై వారితో ఆటలు ఆడించి, ఎలిమినేషన్ రౌండ్ ను నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. శనివారం నాటి ఎపిసోడ్ షూటింగ్ నేడు ముగించాల్సి వుంటుంది.

అయితే, 'వైల్డ్ డాగ్' సినిమా షూటింగ్ కోసం థాయ్ వెళ్లిన నాగ్, అక్కడ దాదాపు రెండు వారాలు ఉండాల్సి వుంది. దీంతో ఈ వీకెండ్ ఎపిసోడ్స్ కు ఆయన అందుబాటులో ఉండక పోవచ్చని తెలుస్తుండగా, గత సీజన్ లో చేసినట్టుగా మరో ప్రముఖ తారను పెట్టి షూటింగ్ పూర్తి చేయనున్నారని తొలుత వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే, ఓ ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ కు వచ్చి, షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వెళ్లాలని నాగ్ భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. నాగ్ చార్టెడ్ ఫ్లయిట్ లో వస్తానని చెబితే, అందుకు బిగ్ బాస్ నుంచి ఏ విధమైన అభ్యంతరం ఉండదు. ఇక నాగ్ ఈ సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటేనే, వీకెండ్ షూటింగ్ మొదలవుతుంది.
Bigg Boss
Nagarjuna
Host
Thailand
Shooting

More Telugu News