Ram Vilas Pashwan: కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతి

Union Minister Ram Vilas Paswan passes away
  • కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న పాశ్వాన్
  • ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • తండ్రి మృతిని ట్విట్టర్ ద్వారా ప్రకటించిన చిరాగ్ పాశ్వాన్
కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కాసేపటి క్రితం మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో ఆయనకు హార్ట్ సర్జరీ కూడా నిర్వహించారు. పాశ్వాన్ వయసు 74 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల రాజకీయ నాయకులు దిగ్భాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఒక బలమైన నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Ram Vilas Pashwan
Dead

More Telugu News