పంజాబ్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్

08-10-2020 Thu 19:24
  • దుబాయ్ లో సన్ రైజర్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్
  • సిద్ధార్థ్ కౌల్ స్థానంలో ఖలీల్ ను తీసుకున్న సన్ రైజర్స్
  • ఏకంగా మూడు మార్పులు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్
Sunrisers Hyderabad won the toss against Kings XI Punjab

ఐపీఎల్ లో బాగా వెనుకబడిపోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఛేజింగ్ లు ఏ మాత్రం కలిసిరాకపోవడంతో కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముందు బ్యాటింగ్ చేసి ప్రత్యర్థికి లక్ష్యాన్ని నిర్దేశించడానికే మొగ్గుచూపాడు. ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ జట్టులో ఒక మార్పు చేశారు. పేసర్ సిద్ధార్థ్ కౌల్ స్థానంలో లెఫ్టార్మ్ సీమర్ ఖలీల్ అహ్మద్ ను తుదిజట్టులోకి తీసుకున్నారు.

ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వరుసగా ఓటముల పాలవుతున్న నేపథ్యంలో మూడు మార్పులు చేశారు. జోర్డాన్, బ్రార్, సర్ఫరాజ్ స్థానంలో ప్రభ్ సిమ్రన్, అర్షదీప్, ముజీబ్ లు జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్ కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నిలవనుంది.