Tammineni Sitaram: ఏపీ స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

AP HC warns Speaker Tammineni Sitaram
  • హైకోర్టు తీర్పులపై వ్యాఖ్యలు చేసిన తమ్మినేని
  • రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్న హైకోర్టు
  • ఏపీలో నెలకొన్న పరిస్థితి మరెక్కడా లేదని వ్యాఖ్య
న్యాయవ్యవస్థను ఉద్దేశించి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికింది.

 హైకోర్టు వెలువరించిన తీర్పులపై అసహనం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని... బహిరంగంగా కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పింది. ఏపీలో నెలకొన్న పరిస్థితులు దేశంలో మరెక్కడా లేవని అసహనం వ్యక్తం చేసింది.
Tammineni Sitaram
YSRCP
AP High Court

More Telugu News