Sanjana Galrani: చైనా యాప్ ల సాయంతో గుట్టుగా నటి సంజన లావాదేవీలు!

  • డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి సంజన
  • బింగో, హకూనా యాప్ లతో సంజన ధనార్జన
  • సంజన కార్యకలాపాలపై దృష్టిసారించిన సీసీబీ, ఈడీ
Investigation reveals how Sanjana making transactions using apps

డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి సంజన గల్రానిపై సీసీబీ, ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఖరీదైన పార్టీలు ఏర్పాటు చేయడం, ఆ పార్టీలకు వచ్చే మిలియనీర్లు, ఇండస్ట్రియలిస్టుల కుటుంబాలకు చెందినవారికి, సినీ సెలబ్రిటీలకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తూ సంజన బాగానే సంపాదించారని అధికారులు అనుమానిస్తున్నారు.

అలాగే సంజన బింగో, హకూనా అనే రెండు చైనా యాప్ ల సాయంతోనూ ధనార్జన సాగిస్తున్నట్టు వెల్లడైంది. బింగో యాప్ ఆన్ లైన్ జూదానికి సంబంధించిన యాప్. ఈ యాప్ ను ఓ ఇంటర్నెట్ కాసినోగా భావించవచ్చు. ఇందులో సంజన గేమింగ్ కు పాల్పడినట్టు తెలిసింది.

ఇక హకూనా యాప్ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఉపయోగిస్తుంటారు. ఈ యాప్ ద్వారా చాటింగ్ చేసి అనేక అంశాలపై బెట్టింగులు నిర్వహించే వీలుంటుంది. హకూనా యాప్ సాయంతో సంజన పెద్ద ఎత్తున నగదు బదిలీలు చేసినట్టు దర్యాప్తులో తేలింది.

ఈ నగదు లావాదేవీలకు డ్రగ్స్ వ్యవహారంతో ఏమైనా సంబంధం ఉందా? అనేది నిర్ధారణ అయితే, సంజనపై మరిన్ని అభియోగాలు మోపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సంజన గల్రాని బెంగళూరు పరప్పన జైలులో ఉన్నారు.

More Telugu News