Donald Trump: నేను పొందిన చికిత్సనే అందరికీ అందేలా చూస్తా: డొనాల్డ్ ట్రంప్

Trump Says By God GraceOnly  i Got Corona
  • వైరస్ వచ్చిన తరువాత దాని ప్రభావం తెలిసింది
  • నివారించేందుకు అద్భుత ఔషధాలు కూడా ఉన్నాయి
  • తనకు కరోనా సోకడం అన్నది దేవుడి దీవెన అన్న ట్రంప్  
తనకు కరోనా సోకడం అన్నది దేవుడు ఇచ్చిన దీవెనని, ఈ మహమ్మారి తనకు సోకిన తరువాతనే దీన్ని నయం చేయగల అత్యంత శక్తిమంతమైన ఔషధాల గురించి తనకు తెలిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు వైట్ హౌస్ నుంచి ఓ వీడియోను విడుదల చేసిన ఆయన, చైనాను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా ఎంతో పాపం చేసిందని, అందుకు తగిన భారీ మూల్యాన్ని చెల్లించుకుని తీరుతుందని శాపాలు పెట్టారు.

తనకు చికిత్సను అందించిన వైద్యులపై ప్రశంసలు కురిపించిన ఆయన, తనకు అందిన చికిత్సనే, అందరు అమెరికన్లకూ ఉచితంగా అందించేలా చూస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ చికిత్స పొందేందుకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన ఆయన,వైరస్ రావడానికి అమెరికన్లు కారణం కాదని, ఇందుకు కారణం చైనాయేనని స్పష్టం చేశారు. కాగా, కరోనా బారిన పడిన తరువాత ట్రంప్ ను వాల్టర్ రీడ్ ఆర్మీ హాస్పిటల్ లో చేర్చి, మూడు రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసిన సంగతి తెలిసిందే.
Donald Trump
Corona Virus
China
God

More Telugu News