Dubbaka: దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి.. ప్రకటించిన అధిష్ఠానం

Cheruku Srinivas Reddy is the congress Candidate in Dubbaka by poll
  • టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
  • మంగళవారం చేరిక.. ఆ వెంటనే టికెట్ ఖరారు
  • టీఆర్ఎస్ నుంచి సుజాత, బీజేపీ నుంచి రఘునందనరావు బరిలోకి
దుబ్బాక ఉప ఎన్నికలో బరిలోకి దిగనున్న అభ్యర్థిని కాంగ్రెస్ ఖరారు చేసింది. టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.

శ్రీనివాస్‌రెడ్డి మంగళవారమే ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా సోలిపేట సుజాతను ఎన్నికల బరిలోకి దింపుతుండగా, రఘునందనరావు పేరును బీజేపీ ప్రకటించింది. కాగా, టీఆర్ఎస్ నుంచి దుబ్బాక టికెట్‌ను ఆశించి భంగపడిన శ్రీనివాస్‌రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరగా, ఆ వెంటనే ఆయనకు టికెట్ ఖరారు కావడం విశేషం. ఈ విషయంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.
Dubbaka
By Election
Telangana
Congress
Cheruku srinivas reddy

More Telugu News