RGV: ఫిఫ్త్ లుక్ పోస్టర్ విడుదల చేసిన వర్మ.. ఎవరి పోలికలైనా కనిపిస్తే కాకతాళీయమేనంటూ ట్వీట్

Varma released fifth look poster from RGV Missing
  • ఆర్జీవీ మిస్సింగ్ సినిమా తీస్తున్న వర్మ
  • అదిర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం
  • ఇడుగో గజినీకాంత్ అంటూ మరో లుక్
విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆర్జీవీ మిస్సింగ్ అంటూ తనపై తానే సినిమా తీస్తున్నారు. ఇప్పటికే కావాల్సినంత హైప్ రాబట్టుకున్న వర్మ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫిఫ్త్ లుక్ విడుదల చేశారు. ఓ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అని వెల్లడించారు. ఇతనిలో ఎవరి పోలికలైనా కనిపిస్తే అది కేవలం కాకతాళీయమేనని పేర్కొన్నారు. ఆ తర్వాత మరో ట్వీట్ లో ఇతని పేరు గజినీకాంత్ అంటూ వెల్లడించారు.

కాగా, ఫిఫ్త్ లుక్ పోస్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్... అంటూ ఆర్జీవీ కిడ్నాప్ అయ్యాడని, పీకే ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ సీఎం, అతని కుమారుడు అనుమానితులని పేర్కొన్నారు. ఆర్జీవీ మిస్సింగ్ చిత్రానికి అదిర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

RGV
Fifth Poster
RGV Missing
Gajinikant

More Telugu News