Kolkata Knight Riders: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్

Kolkata Knight Riders won the toss and elected bat against mighty Chennai Super Kings
  • ఐపీఎల్ లో నేడు కోల్ కతా వర్సెస్ చెన్నై
  • మార్పుల్లేకుండా బరిలో దిగుతున్న కోల్ కతా
  • పియూష్ చావ్లా స్థానంలో కర్ణ్ శర్మను తీసుకున్న చెన్నై

ఐపీఎల్ లో ట్రెండ్ మారింది. టాస్ గెలిచిన జట్లు బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపుతున్నాయి. యూఏఈ పిచ్ లు చేజింగ్ కు అనువుగా లేకపోవడంతో జట్లు తమ వ్యూహాలను పునఃసమీక్షించుకుంటున్నాయి. ఇవాళ అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. కోల్ కతాకు బ్యాటింగ్ లో ఎలాంటి సమస్యలు లేకపోవడంతో అదే లైనప్ ను కొనసాగించాలని నిర్ణయించింది. బౌలింగ్ విభాగంలోనూ మార్పులేమీ లేవు. ఇక చెన్నై జట్టులో ఓ మార్పు చేశారు. లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా స్థానంలో మరో లెగ్గీ కర్ణ్ శర్మకు చోటిచ్చారు.

  • Loading...

More Telugu News