Donald Trump: ఇది అభూత కల్పన కాదు: కరోనా కేసులపై పౌచీ

  • కరోనా అభూత కల్పన అని కొందరు నమ్ముతున్నారు
  • అలాంటివారితో నివారణ చర్యల గురించి ఎలా చర్చించాలి? అని ప్రశ్న
  • సమాధానం చెప్పిన పౌచి
  • వైట్‌హౌస్‌లో ప్రతి రోజూ మరింత మంది కొవిడ్‌ బారిన పడుతుంటారని వ్యాఖ్య
Fauci slams trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు శ్వేతసౌధంలోని పలువురికి కరోనా సోకిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ట్రంప్ మాస్క్ లేకుండా ఫొటోలకు పోజులు ఇస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోని ఫౌచి పలు వ్యాఖ్యలు చేశారు.

కరోనా మహమ్మారి అభూత కల్పన అని నమ్మే మొండివారితో నివారణ చర్యల గురించి ఎలా చర్చించాలి? అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనిపై పౌచి స్పందిస్తూ, ఇది అభూత కల్పన ఎంతమాత్రం కాదని చెప్పారు. 'ఈ వారం వైట్‌హౌస్‌ను ఒకసారి గమనించండి. అక్కడ జరుగుతున్నది వాస్తవం. ప్రతి రోజూ మరింత మందికి కొవిడ్ రావచ్చు. అయినా అక్కడ సరైన చర్యలు తీసుకుంటే ఈ కేసులను నివారించవచ్చు' అని తెలిపారు.

ఇది దురదృష్టకర పరిస్థితని, అసలు ఇది చోటు చేసుకోకుండా ముందే నివారించవచ్చని వ్యాఖ్యానించారు. ట్రంప్‌కి కరోనా సోకినప్పటికీ ఆయన ప్రవర్తిస్తోన్న తీరు పట్ల విమర్శలు వస్తోన్న నేపథ్యంలో పౌచీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

More Telugu News