నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మరో హామీ అమలుకు శ్రీకారం: విజయసాయిరెడ్డి
- రేపు ప్రారంభించనున్న జగనన్న విద్యాకానుక పథకం
- 42.34 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
- విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు
ఒకటో తరగతి నుంచి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టారని ఆయన ట్వీట్లు చేశారు. కాగా, ఈ పథకంలో భాగంగా ఏపీ వ్యాప్తంగా మొత్తం 42,34,322 మంది విద్యార్థులకు సుమారు రూ.650 కోట్ల ఖర్చుతో ‘కిట్లు’ అందజేయనున్నారు. అంతేకాదు, ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు కూడా ఇస్తారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.