Raviteja: రవితేజ 'క్రాక్' షూటింగు మళ్లీ మొదలైంది!

Raviteja joins Crack shoot
  • గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్'
  • లాక్ డౌన్ కి ముందు చాలా భాగం పూర్తి 
  • నేటి నుంచి హైదరాబాదులో షూటింగ్   
టాలీవుడ్ తారలను కరోనా భయం మెల్లగా వీడుతోంది. ఒక్కొక్కరే తమ షూటింగులు మొదలెడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆరు నెలలుగా చిత్ర నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఆయా నిర్మాతలు భారీగా నష్టపోయారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఆయా హీరోలు షూటింగులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే, వకీల్ సాబ్, ఆర్ఆర్ఆర్.. వంటి సినిమాల షూటింగులు మొదలయ్యాయి.

 ఈ క్రమంలో రవితేజ కూడా తన తాజా చిత్రం 'క్రాక్' సినిమా షూటింగును ఈ రోజు హైదరాబాదులో ప్రారంభించాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చాలా భాగం లాక్ డౌన్ కి ముందు జరిగింది. ఇక ఈ రోజు షూటింగ్ మొదలైనట్టు దర్శకుడు గోపీచంద్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.  చాలా ఆనందంతో, ఎనర్జీతో షూటింగ్ తిరిగి ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నాడు.

ఈ 'క్రాక్' సినిమాలో రవితేజ పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రవితేజ, గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. గతంలో వీరి కాంబినేషన్లో 'డాన్ శీను', 'బలుపు' సినిమాలు వచ్చాయి.
Raviteja
Gopichand Malineni
Shruti Hassan
Varalakshmi

More Telugu News