WHO: డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ఆశిస్తున్నాం: డబ్ల్యూహెచ్ఓ

  • ఎగ్జిక్యూటివ్ బోర్డులో టీడ్రాస్ ప్రసంగం
  • మొత్తం, 9 వ్యాక్సిన్లు తుది దశలో ఉన్నాయి
  • 2021లో 200 కోట్ల డోస్ ల లక్ష్యం
Hope for Vaccine by December

కొవిడ్-19ను నిలువరించే వ్యాక్సిన్ ఈ సంవత్సరం చివరకు సిద్ధమవుతుందని ఆశిస్తున్నామని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టీడ్రాస్ అధ్ నామ్ వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ పై మరిన్ని వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

కరోనా మహమ్మారిపై రెండు రోజుల ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ప్రపంచానికి వ్యాక్సిన్ అవసరం ఎంతైనా ఉందని, డిసెంబర్ నాటికి ఓ వ్యాక్సిన్ వస్తుందన్న ఆశ ఉందని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వ్యాక్సిన్లు ప్రస్తుతం తుది దశ ప్రయోగ పరీక్షల్లో ఉన్నాయని, 2021 ముగిసేలోగా మొత్తం 200 కోట్ల డోస్ లను అందించాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామని తెలియజేశారు.

More Telugu News