West Godavari District: వైఎస్సార్ చేయూత పథకంలో అనర్హులకు చోటు.. 17 మంది గ్రామ వలంటీర్లపై వేటు

MPDO suspends 17 Gram volunteers in west godavari dist
  • పశ్చిమ గోదావరి జిల్లా దేవరాపల్లి మండలంలో ఘటన
  • ప్రభుత్వ ఉద్యోగులు, విదేశాల్లో ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు
  • 21 మంది అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేసిన వలంటీర్లు
వైఎస్సార్ చేయూత పథకంలో అనర్హులను గుర్తించడంలో విఫలమైన గ్రామ వలంటీర్లపై అధికారులు వేటు వేశారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరాపల్లి మండలంలో జరిగిందీ ఘటన. నిజానికి ప్రభుత్వ ఉద్యోగులు, విదేశాల్లో ఉన్నవారు వైఎస్సార్ చేయూత పథకానికి అనర్హులు. అయినప్పటికీ వివిధ గ్రామాల్లో ఈ పథకానికి అర్హత లేని 21 మందిని వలంటీర్లు నమోదు చేశారు.

దీనిని తీవ్రంగా పరిగణించిన అధికారులు 17 మంది గ్రామ వలంటీర్లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో ఎస్‌వీఎస్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, 9 మంది సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లకు కూడా నోటీసులు జారీ చేశారు.
West Godavari District
grama volunteer
suspension
ysr cheyutha

More Telugu News