Junior NTR: జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ ల మధ్య ట్వీట్ల సంభాషణ!

Tweets between Junior NTR and Ramcharan
  • ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభం
  • ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నది నిజమవుతోందన్న చరణ్
  • వెయిట్ చేయలేకపోతున్నానన్న తారక్
తారక్, రాంచరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం షూటింగ్ చాలా కాలం తర్వాత మళ్లీ ప్రారంభమైంది. 'రామరాజు ఫర్ భీమ్' వీడియోను ఈ నెల 22న విడుదల చేయబోతున్నట్టు దర్శకనిర్మాతలు వెల్లడించారు. ఈ విషయాన్ని చరణ్ కూడా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. కొన్ని నెలల తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని చరణ్ చెప్పాడు. అంతేకాదు ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ ఓ కామెంట్ పెట్టాడు. 'మై డియర్ తారక్ బ్రదర్... మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నది ఇప్పుడు నిజమవుతోంది. నేను నీకు ప్రామిస్ చేసిన విధంగా అక్టోబర్ 22న నీకు మంచి గిఫ్ట్ ఇస్తున్నా' అని ట్వీట్ చేశారు.

మరోవైపు ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించాడు. మళ్లీ సెట్స్ మీదకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. బ్రదర్ చరణ్ అక్టోబర్ 22 వరకు నేను వెయిట్ చేయలేకపోతున్నా అని ట్వీట్ చేశాడు.
Junior NTR
Ramcharan
Tollywood
RRR

More Telugu News