Solipeta Sujatha: దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్!

Solipeta Sujatha To Contest from Dubbaka as TRS Candidate
  • సోలిపేట సుజాత పేరు ఖరారు
  • అభివృద్ధి కొనసాగాల్సి వుంది
  • రామలింగారెడ్డి కలలు నెరవేరుస్తామన్న కేసీఆర్
దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గానికి జరుగనున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థినిగా మాజీ ఎమ్మెల్యే, దివంగత సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత పోటీ చేస్తారు. ఈ మేరకు సుజాత పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు.

 "సోలిపేట రామలింగారెడ్డి ఉద్యమ నేత. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. పార్టీ కోసం అంకిత భావంతోనూ పని చేశారు. తన తుది శ్వాస వరకూ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి శ్రమించారు. సోలిపేట ఫ్యామిలీ మొత్తం నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాలు పంచుకుంది. నియోజకవర్గంలో సోలిపేట కుటుంబానికి ప్రతి ఒక్కరితో అనుబంధం ఉంది. అభివృద్ధి దిశగా రామలింగారెడ్డి కన్న కలలను నెరవేరుస్తాం. అభివృద్ధి, సంక్షేమం కొనసాగడానికి ఆయన ఇంటి సభ్యులే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం సమంజసం. ఈ కారణంతోనే, అందరినీ సంప్రదించిన తరువాతనే సుజాతను ఎంపిక చేశాం" అని సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
Solipeta Sujatha
Dubbaka
KCR

More Telugu News