Jagananna Vidya Kanuka: 'జగనన్న విద్యా కానుక' పథకానికి సర్వం సిద్ధం.. కార్యక్రమాన్ని సీఎం ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారంటే..?

Jagan to inaugurate Jagananna Vidya Kanuka on Oct 8
  • ఈ నెల 8న పథకం ప్రారంభం
  • కంకిపాడులో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
  • నవంబర్ 2 నుంచి పాఠశాలలను ప్రారంభించే అవకాశం

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న మరో పథకం 'జగనన్న విద్యా కానుక' ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ పథకం కింద విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, ఒక జత బూట్లు, మూడు జతల సాక్సులు, బెల్టు, బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలను అందించనున్నారు.

వాస్తవానికి జూన్ లో పాఠశాలలు ప్రారంభమైన వెంటనే కిట్లను విద్యార్థులకు అందించాలని అనుకున్నారు. అయితే కరోనా కారణంగా పాఠశాలలు ఇంతవరకు తెరుచుకోలేదు. తాజాగా పాఠశాలలను నవంబర్ 2వ తేదీ నుంచి తెరవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విద్యాకానుక కిట్లను ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కిట్లను ముందుగానే అందిస్తే పాఠశాలలు తెరుచుకునే సమయానికి విద్యార్థులు యూనిఫాం కుట్టించుకునే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వ భావన.

మరోవైపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8న ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. విజయవాడ సమీపంలో ఉన్న కంకిపాడులోని పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభిస్తారు.

  • Loading...

More Telugu News