Vijay Sai Reddy: కరోనా నియంత్రణలో ఏపీ, తమిళనాడు భేష్ అని కాలిఫోర్నియా యూనివర్సిటీ తేల్చింది: విజయసాయిరెడ్డి

Vijaysai Reddy says Califorina University stated AP and Tamilnadu best in corona control
  • ఏపీలో తగ్గుతున్న కరోనా తీవ్రత
  • కరోనా మరణాలు ఏపీలో అత్యల్పం అన్న విజయసాయి
  • జగన్ విధానాలు దేశానికే ఆదర్శమంటూ వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్నిరోజులుగా కరోనా ఉద్ధృతి తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరణాల సంఖ్య తగ్గడమే కాదు, కొత్త కేసుల తీవ్రత కూడా మునుపటిస్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.

కొవిడ్-19 నియంత్రణలో ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు భేష్ అని కాలిఫోర్నియా యూనివర్సిటీ తేల్చిందని వెల్లడించారు. దేశంలో కరోనా మరణాల శాతం ఏపీలోనే తక్కువ అని వివరించారు. టెస్టింగ్, ట్రేసింగ్ విధానం వల్లే ఇది సాధ్యమైందని విజయసాయి తెలిపారు. సీఎం జగన్ అనుసరిస్తున్న ఆరోగ్య విధానాలు దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
California University
Andhra Pradesh
Tamilnadu
Corona Virus
Jagan
India

More Telugu News