Sneha Ullal: ఐశ్వర్యారాయ్‌తో పోల్చడం నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు: హీరోయిన్ స్నేహ ఉల్లాల్‌

 Comparisons with Aishwarya Rai didnt bother me says Sneha Ullal
  • ఐదేళ్లుగా సినిమాలకు దూరం
  • 'ఎక్స్‌పైరీ డేట్'‌ సినిమా ద్వారా రీఎంట్రీ
  • శరీరాకృతి గురించి ఎన్నడూ ఇబ్బంది పడలేదన్న స్నేహ
  • ప్రమోషన్‌ కోసమే తనను ఐశ్వర్యతో పోల్చారని వ్యాఖ్య
టాలీవుడ్‌లో కొన్ని సినిమాలలో నటించిన నటి స్నేహ ఉల్లాల్‌ ఐదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఆమె తిరిగి 'ఎక్స్‌పైరీ డేట్'‌ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తోంది. తాజాగా, ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు.

తాను శరీరాకృతి గురించి ఎన్నడూ ఇబ్బంది పడలేదని, ఐశ్వర్యరాయ్‌లా తాను ఉన్నానని అందరూ అనుకోవడం కూడా తనను బాధపెట్టలేదని తెలిపింది. సినీ పరిశ్రమలో ప్రమోషన్‌ కోసమే తనను అలా పరిచయం చేశారని ఆమె తెలిపింది.

తన జీవితంపై తనకు ఎలాంటి బాధ లేదుకానీ, సినీ పరిశ్రమలోకి మాత్రం చాలా త్వరగా వచ్చానని భావిస్తున్నానని అభిప్రాయపడింది. ఇంకొన్నాళ్లు సినిమా రంగంలోకి రాకపోయి ఉంటే కనుక నటిగా తనకు తాను చాలా శిక్షణ ఇచ్చుకునేదాన్నని చెప్పింది. తాను చాలా ఏళ్ల అనంతరం 'ఎక్స్‌పైరీ డేట్‌' సినిమాతో మళ్లీ వస్తున్నానని తెలిపింది.  
Sneha Ullal
Bollywood
Tollywood

More Telugu News