ఉదయం పీఏకి ఫోన్ చేస్తే సాయంత్రం మా పెద్దాయనే తిరిగి ఫోన్ చేశారు: సోమిరెడ్డి
- కరోనా బారినపడిన వెంకయ్యనాయుడు
- ట్విట్టర్ లో స్పందించిన సోమిరెడ్డి
- తెలుగువారి ఆకాంక్షను వెంకయ్యకు తెలిపానని వెల్లడి
"మా పెద్దాయన వెంకయ్యనాయుడు గారి ఆరోగ్యంపై వాకబు చేయడానికి ఈ రోజు ఉదయం ఆయన పీఏకి ఫోన్ చేశాను. అయితే సాయంత్రం పెద్దాయనే తిరిగి కాల్ చేసి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు" అని వివరించారు. మీరు సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకుని దేశానికి రాష్ట్రపతి కావాలనేది నాతో పాటు తెలుగువారందరి ఆకాంక్ష అని ఆయనకు తెలియజేశానని సోమిరెడ్డి వెల్లడించారు.