KXIP: సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్

Kings XI Punjab won the toss in a much needed situation against Chennai Super Kings
  • దుబాయ్ లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్, పంజాబ్
  • మొదట బ్యాటింగ్ చేయాలని పంజాబ్ నిర్ణయం
  • పంజాబ్ జట్టులో మూడు మార్పులు
ఐపీఎల్ లో నేడు జరిగే రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. దుబాయ్ లో జరిగే ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే... టోర్నీ ఆరంభంలో గట్టి జట్లుగా భావించిన చెన్నై, పంజాబ్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. నాలుగేసి మ్యాచ్ లు ఆడి, మూడు సార్లు ఓడాయి. ఒకే ఒక్క విజయం నమోదు చేసుకున్నాయి. కీలకమైన మరో గెలుపు కోసం ఈ రెండు జట్లు పోరాడతాయనడంలో సందేహం లేదు.

పంజాబ్ జట్టులో పలు మార్పులు చేశారు. కరుణ్ నాయర్, జిమ్మీ నీషామ్, గౌతమ్ స్థానంలో మన్ దీప్ సింగ్, హర్ ప్రీత్ బ్రార్, క్రిస్ జోర్డాన్ జట్టులోకి వచ్చారు. ఇక చెన్నై జట్టులో ఎలాంటి మార్పులు లేవు.

KXIP
CSK
Toss
Dubai

More Telugu News