Gold Coins: శ్రీశైలం తవ్వకాల్లో మరోసారి బయటపడిన బంగారు నాణేలు

Gold coins found in Srisailam construction works
  • ఘంటామఠంలో బంగారు, వెండి నాణేలు లభ్యం
  • బంగారంతో కూడిన పెట్టెను గుర్తించిన వైనం
  • 2017లోనూ ఇదే స్థలంలో బంగారం గుర్తింపు
సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో బంగారు నాణేలు బయటపడ్డాయి. ప్రస్తుతం శ్రీశైలం క్షేత్రంలో ఘంటామఠం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జరిపిన తవ్వకాల్లో  ఓ పెట్టె బయటపడింది. ఆ పెట్టెలో బంగారు, వెండి నాణేలు ఉన్నాయి. 15 బంగారు నాణేలు, ఒక బంగారు ఉంగరం మాత్రమే కాకుండా 17 వెండి నాణేలను కూడా గుర్తించారు.

శ్రీశైలంలో బంగారు నాణేల కలకలం రేగడంతో ఆలయ ఈవో కేఎస్ రామారావు, తహసీల్దార్ రాజేంద్ర సింగ్, సీఐ రవీంద్ర ఘంటామఠం వద్దకు చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆ నాణేలను అధికారులను స్వాధీనం చేసుకున్నారు.

శ్రీశైలంలో నిధులు బయల్పడడం ఇదే మొదటిసారి కాదు. 2017లోనూ సరిగ్గా ఘంటామఠం వద్దే బంగారు, వెండి వస్తువులు లభించాయి. 18 బంగారు నాణేలు, 3 బంగారు కడియాలు, 3 ఉంగరాలు, చిన్నపాటి బంగారు వస్తువులు, 147 వెండి నాణేలు, ఒక వెండి బేసిన్, 2 వెండి గిన్నెలు లభ్యమయ్యాయి.
Gold Coins
Srisailam
Ghanta Matham
Andhra Pradesh

More Telugu News