Janasena: హత్రాస్ కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా సరైన నిర్ణయం తీసుకున్నారు: జనసేన

  • నాదెండ్ల మనోహర్ నుంచి ప్రకటన
  • దోషులకు శిక్ష పడుతుందన్న నమ్మకం ఉందని వెల్లడి
  • అందరూ గళం విప్పాలని పిలుపు
Janasena welcomes Yogi Adithyanath decision of handing Hathras case to CBI

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో19 ఏళ్ల అమ్మాయిపై పైశాచిక దాడి కేసును యోగి ఆదిత్యనాథ్ సర్కారు సీబీఐకి అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ స్వాగతించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా సీఎం యోగి ఆదిత్యనాథ్ సరైన నిర్ణయం తీసుకున్నారని ఓ ప్రకటనలో అభిప్రాయపడింది. ఈ కేసులో సీబీఐ విచారణ ద్వారా దోషులకు శిక్ష పడుతుందని జనసేన నమ్ముతోందని ఆ ప్రకటనలో పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

అత్యాచార ఘటనలు జరిగినప్పుడు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ గళం విప్పాలని జనసేన ఆది నుంచి కోరుకుంటోందని తెలిపారు. అమ్మాయిల భద్రతకు ఈ సమాజం భరోసా ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఏపీలోని కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి అనే బాలిక వ్యవహారంలో జనసేన ఇదే తరహాలో పోరాడుతోందని వివరించారు.

నాడు కర్నూలులో జనసేనాని పవన్ కల్యాణ్ కవాతు చేయడంతో ప్రభుత్వం ఆ కేసును సీబీఐకి అప్పగించిందని, అయితే ఇంతవరకు సీబీఐ నుంచి ఈ కేసుపై అధికారిక ప్రకటన లేదని తెలిపారు.

More Telugu News