Virat Kohli: ఐపీఎల్ నయా సంచలనం తెవాటియాకు కోహ్లీ కానుక

Kohli gifts his jersey to IPL new sensation Rahul Tewatia
  • ఒక్క ఇన్నింగ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న తెవాటియా
  • తన జెర్సీని తెవాటియాకు ఇచ్చిన కోహ్లీ
  • నిన్న బెంగళూరుతో మ్యాచ్ లోనూ తెవాటియా మెరుపులు
ఐపీఎల్ తాజా సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాహుల్ తెవాటియా ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది సంచలనం సృష్టించాడు. ఆ మ్యాచ్ లో మొదట నత్తనడకన బ్యాటింగ్ చేసి అందరూ విసుగు చెందేలా చేసిన ఎడమచేతివాటం తెవాటియా ఆపై ఒక్కసారిగా వేగం పెంచి విధ్వంసం సృష్టించాడు.

ఆ ఇన్నింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీని సైతం ఆకట్టుకుంది. అందుకే కోహ్లీ తన జెర్సీని తెవాటియాకు కానుకగా ఇచ్చాడు. ఆ జెర్సీపై డియర్ రాహుల్... బెస్ట్ విషెస్ అని రాసి బహూకరించాడు. నిన్న సాయంత్రం బెంగళూరు, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లోనూ తెవాటియా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 12 బంతుల్లో 3 భారీ సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. దాంతో కోహ్లీ... తెవాటియాకు అభిమానిగా మారిపోయాడు. తన జెర్సీని ఇచ్చి అతడిని మరింత ప్రోత్సహించాడు.
Virat Kohli
Rahul Tewatia
Jersey
Rajasthan Royals
Royal Challengers Banglore
IPL 2020

More Telugu News