Bigg Boss: ఎందుకీ గంగవ్వ భజన... 'బిగ్ బాస్'పై పెరుగుతున్న ప్రేక్షకుల వ్యతిరేకత!

Netizens fire Over Favouratism for Gangavva in Bigg Boss
  • ప్రతి విషయంలోనూ గంగవ్వ భజనేనా?
  • ఫ్యాషన్ టాస్క్ లో గెలిపించడంపై విమర్శలు
  • ఆడకుండా గెలుపు ప్రకటించేయాలని నెటిజన్ల సెటైర్లు
టాలీవుడ్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ - 4 కంటెస్టెంట్లలో గంగవ్వకు ఎంతో ప్రత్యేకత ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమెను పోటీదారుగా ఎన్నుకోవడంతోనే నిర్వాహకులు, తమ షో ఎంత వినూత్నంగా ఉంటుందోనని తొలి రోజునే చెప్పేశారు. అయితే, ఈ షో గడిచే కొద్దీ, బిగ్ బాస్ గంగవ్వకు ఫేవర్ గా తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రేక్షకులు అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. కొందరికి ఫేవరెట్ గా బిగ్ ఉంటూ, పక్షపాతం చూపిస్తున్నారని, దీంతో ప్రదర్శన గతి తప్పుతోందని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా, ఇటీవలి ఫ్యాషన్ షో ఎపిసోడ్ విజేతగా గంగవ్వ నిలిచిన తరువాత, షోపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎందరో నెటిజన్లు బిగ్ బాస్ కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి, తమ నిరసనలు తెలియజేశారు. గంగవ్వపై ఉన్న సింపతీతో, ప్రతి ఒక్కరూ ఆమె తరఫున నిలుస్తూ, కావాలనే భజన చేస్తున్నారని నెటిజన్లు అంటున్నారు. ఆమె టాస్క్ ల్లోనూ పాల్గొనకుండా పక్కన కూర్చుంటోందని, ఏమీ ఆడని వారికి చివరకు కప్ కూడా ఇచ్చేలా ఉన్నారని సెటైర్లు పడుతున్నాయి.

ప్రతి దానికి హౌస్ లోని వారంతా తమకు ఓట్లు పడాలని గంగవ్వే బెస్ట్ అని కితాబిచ్చేస్తున్నారని, ఈ కారణంగా ఇక వారికి ఓట్లు పడే అవకాశాలు తక్కువేనని హెచ్చరిస్తున్నారు. దీంతో రానున్న వారాల్లో గంగవ్వతో బిగ్ బాస్ ఏం చేయిస్తారు? తనపై వస్తున్న వ్యతిరేకతను స్వయంగా చూస్తున్న బిగ్ బాస్, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయం ఆసక్తికరంగా మారింది.
Bigg Boss
Bigg Boss Telugu 4
Gangavva

More Telugu News