Ileana: ఇలియానాకు 'అందంగా లేనా?' అనే డౌట్ వచ్చేదట!

  • ఇలియానాకు తన ఫిజిక్ పై సందేహాలు  
  • తెలివైన అమ్మాయిని కానని డౌట్ 
  • సందేహాలతో విపరీతమైన ఆందోళన 
Ileana used to think about her beauty

ఒకప్పుడు తెలుగులో నెంబర్ వన్ కథానాయికగా రాణించి.. నాజూకు అందానికి చిరునామాగా నిలిచిన గోవా బ్యూటీ ఇలియానాకు తన శరీరంపై తనకే డౌట్స్ వుండేవట. తన అందంపై రకరకాల సందేహాలు చుట్టుముడుతూ వేధించేవని, దాంతో విపరీతమైన ఆందోళనకు గురయ్యేదానినని తాజాగా చెప్పింది.

పైకి చూడడానికి తానెలా ఉన్నానో అనే ఆందోళన ఎక్కువగా ఉండేదని, తన అందం గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ ఉండేదానినని తెలిపింది. అసలు తాను తెలివైన అమ్మాయిని కానని అనుకునేదట కూడా!   

"నా నడుం సన్నగా ఉందని.. చేతులు సన్నగా ఉన్నాయని, అందరిలా పెద్ద హైట్ లేనని, ముక్కు, లిప్స్ సరిగా లేవని, అసలు పెర్ఫెక్ట్ గా లేనని.. ఇలా తెగ మథనపడేదానిని. అయితే, కొన్నాళ్లకు నాకు తెలిసొచ్చింది. దాంతో నా ఫిజిక్ ని, నా అందాన్ని యాజిటీజ్ గా తీసుకోవడం ప్రారంభించాను. ఇతరులు భావించినట్టుగా నేనెందుకు ఉండాలి? అనుకున్నాను. దాంతో నాలోని ఆందోళనలు, భయాలు పటాపంచలైపోయాయి" అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా.

More Telugu News