Corona Virus: కరోనా వైరస్ బలహీనపడుతోంది: వేన్ యూనివర్శిటీ పరిశోధకులు

  • డెట్రాయిట్ హాస్పిటల్ లో పరిశోధన చేసిన పరిశోధకులు
  • ఐదో వారానికల్లా 70 శాతం మందిలో తగ్గిన వైరల్ లోడ్
  • మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచన
Corona virus is weakening says a study

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తం విస్తరించి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. అగ్రదేశం, పేదదేశం అనే తేడా లేకుండా అన్ని దేశాలను వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్, మెడిసిన్ ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. మన దేశంలో కరోనా మరణాలు లక్షను దాటాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో అమెరికాలోని వేన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా వైరస్ క్రమంగా బలహీనపడుతోందని తెలిపారు.

డెట్రాయిట్ హాస్పిటల్ లో చేరిన 700 మంది రోగుల శాంపిల్స్ ని పరిశీలించి వారు ఈ విషయాన్ని వెల్లడించారు. మొదటి వారంలో ఎక్కువ మందిలో అధిక వైరల్ లోడ్ ఉందని... కేవలం నాలుగో వంతు మాత్రమే తక్కువ వైరల్ లోడ్ కలిగి ఉన్నారని పరిశోధకులు తెలిపారు. ఐదో వారం నాటికి 70 శాతానికి పైగా శాంపిల్స్ లో తక్కువ వైరల్ లోడ్ ఉన్నట్టు తేలిందని చెప్పారు. వైరస్ క్రమంగా బలహీనపడుతోందనే విషయం తమ పరిశోధనలో తేలిందని అన్నారు. మాస్కులు ధరిస్తూ, భౌతికదూరాన్ని పాటిస్తే... వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఎలాంటి ప్రమాదం ఉండదనని చెప్పారు.

  • Loading...

More Telugu News