Ayyanna Patrudu: చంద్రబాబు సవాల్ విసిరితే సీఎం జగన్ పారిపోయారు: అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu says CM Jagan back steps for Chandrababu challenge
  • వైసీపీ నేతలపై అయ్యన్న ఫైర్
  • విశాఖ పార్లమెంటు స్థానంలో ఎన్నికలకు వెళదాం అంటూ సవాల్
  • ధర్మాన సిద్ధమా అంటూ ప్రశ్నించిన అయ్యన్న

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు మరోసారి వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. రాజధాని అంశంపై విశాఖ పార్లమెంటు పరిధిలో ఉప ఎన్నిక పెట్టి తేల్చుకుందాం అంటూ ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కు సవాల్ విసిరారు. విశాఖ పార్లమెంటు స్థానం ఒక్కచోటే ఎన్నికలకు వెళదాం... ప్రజల ఉద్దేశమేంటో తెలిసిపోతుంది... ఈ సవాల్ కు మంత్రి ధర్మాన సిద్ధమా? అని ప్రశ్నించారు.

అమరావతి రాజధానా, లేక విశాఖ రాజధానా అనే అంశంపై అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోదాం అని చంద్రబాబు కోరితే సీఎం జగన్ పారిపోయారని ఎద్దేవా చేశారు. విశాఖ ప్రజలు రాజధాని కోరుకోవడంలేదని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. రౌడీయిజం, భూకబ్జాలు, దందాలు, దౌర్జన్యాలతో విశాఖను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News