సైజ్ జీరోలో కీర్తి సురేశ్.. ఆశ్చర్యపోతున్న అభిమానులు

03-10-2020 Sat 16:09
  • వైరల్ అవుతున్న కీర్తి వీడియో
  • స్లిమ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్న కీర్తి
  • కప్పు కాఫీ ఎంతో ఉత్సాహాన్నిస్తుందని వ్యాఖ్య
Keerthy Suresh stunning look in zero size
'మహానటి' సినిమాతో కీర్తిసురేశ్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఉత్తమ జాతీయ నటిగా పేరు తెచ్చుకుంది. పలు అవార్డులు ఆమె సొంతమయ్యాయి. మరోవైపు అప్పటి నుంచి తనకు ప్రాధాన్యత వుండే చిత్రాలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా కీర్తి చాలా యాక్టివ్ గా ఉంటుంది. పలు విషయాలను అభిమానులతో పంచుకుంటుంటుంది.

తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఒక కప్పు కాఫీ తనకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందని... పరిస్థితులు ఎలా ఉన్నా తాను ఒక కప్పు కాఫీ తాగుతానని చెప్పింది. అయితే ఈ వీడియోలో కీర్తి లుక్ చూసి జనాలు షాక్ అవుతున్నారు. బొద్దుగా ఉండే కీర్తి... ఈ వీడియోలో సైజ్ జీరోలో స్లిమ్ గా కనపడుతోంది. లాక్ డౌన్ టైమ్ లో కావాల్సినంత సమయం దొరకడంతో.. తన బాడీపై కీర్తి ఫోకస్ సెట్టిందని నెటిజెన్లు అంటున్నారు.