Trisha: ప్రకాశ్ రాజ్ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన త్రిష

Actress Trisha accepts Prakash Raj Green India Challenge
  • ఉత్సాహంగా సాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్
  • త్రిషను నామినేట్ చేసిన ప్రకాశ్ రాజ్
  • రెండు మొక్కలు నాటానని వెల్లడించిన త్రిష
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. లాక్ డౌన్ సమయంలోనూ పలువురు సెలబ్రిటీలు ఈ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి పర్యావరణ స్ఫూర్తిని చాటారు. ఇటీవల ప్రముఖ దక్షిణాది నటుడు ప్రకాశ్ రాజ్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటి, ఆపై నటి త్రిషను నామినేట్ చేశారు.

తాజాగా, ప్రకాశ్ రాజ్ చాలెంజ్ ను అంగీకరించిన త్రిష తన నివాసంలో మొక్కలు నాటి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ పర్యావరణ కార్యక్రమంలో భాగంగా తాను రెండు మొక్కలు నాటానని త్రిష వెల్లడించారు. అంతేకాదు, అభిమానులందరూ ఈ చాలెంజ్ లో పాలుపంచుకుని తమవంతుగా మొక్కలు నాటి హరిత భారతం కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Trisha
Prakash Raj
Green India Challenge
Saplings
Santosh Kumar
TRS

More Telugu News