Kanakadurga Flyover: విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం ఈ నెల 16న: కేశినేని నాని

Kesineni Nani tells Kanakadurga flyover will be inaugurated shortly
  • ఇప్పటికి రెండుసార్లు వాయిదాపడిన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం
  • మరోసారి ముహూర్తం ఖరారు
  • కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారన్న కేశినేని నాని
బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసం నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి మరోసారి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కనకదుర్గ ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. విజయవాడ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ భారీ ఫ్లైఓవర్ కొంతకాలం కిందటే నిర్మాణం పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటికి రెండుసార్లు ప్రారంభోత్సవం వాయిదా పడింది.

తొలుత సెప్టెంబరు 4న ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా, చివరి నిమిషంలో వాయిదా పడింది. ఆ సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించారు. ఆపై సెప్టెంబరు 18న మరో ముహూర్తం నిర్ణయించినా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకడంతో అది కూడా వాయిదా వేశారు.  

ఈ నేపథ్యంలోనే తాజా ముహూర్తం ఖరారు చేశారు. కాగా, అధికారిక ప్రారంభోత్సవం జరుపకపోయినా, ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ పై రాకపోకలను ఇప్పటికే అనుమతించారు.
Kanakadurga Flyover
Vijayawada
Nitin Gadkari
Kesineni Nani
Telugudesam
Andhra Pradesh

More Telugu News