RRR Movie: ప్రారంభంకానున్న 'ఆర్ఆర్ఆర్' షూటింగ్.. నటులందరికీ క్వారంటైన్!

Quarantine for RRR movie actors
  • కరోనా కారణంగా ఆగిపోయిన 'ఆర్ఆర్ఆర్' షూటింగ్
  • ఈ నెలాఖరున మళ్లీ ప్రారంభం కానున్న షూటింగ్
  • 14 రోజుల పాటు నటులకు క్వారంటైన్
జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో 'ఆర్ఆర్ఆర్' చిత్రం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడి, కోలుకున్నారు. అయితే షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతించడంతో... మళ్లీ షూటింగ్ కు సన్నాహకాలు చేసుకుంటున్నారు.

ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ను మళ్లీ పట్టాలెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా షూటింగ్ లో పాల్గొనే నటులందరూ ఈ నెల 10 నుంచి హోటల్స్ లో 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండనున్నట్టు  తెలుస్తోంది. మరోవైపు షూటింగ్ సమయంలో ఉపయోగించే సామగ్రిని శానిటైజ్ చేయించడానికి, థర్మల్ స్క్రీనింగ్ ద్వారా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
RRR Movie
Shooting
Tollywood
Bollywood

More Telugu News