Devineni Uma: ఈ ప్రాజెక్టులో అస్మదీయసంస్థకు సగంవాటా ఇచ్చారు: దేవినేని ఉమ

  • విశాఖలో చేతులు మారిన మరో భారీ ప్రాజెక్టు కార్తీకవనం  
  • తాళాలు వేసి పనులకు అడ్డంకులు
  • కీలక నేతను కలిశాకే లైన్ క్లియర్
  • నిర్వాహకులతో ఖరీదైన డీల్
devineni uma slams jagan

విశాఖలో మరో భారీ ప్రాజెక్టు ‘కార్తీక వనం’ చేతులు మారిందంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తను పోస్ట్ చేస్తూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ  17 ఏళ్ల క్రితం మ్యాక్‌ లీజర్స్‌ అనే ప్రైవేటు సంస్థతో ప్రాజెక్టు ఒప్పందం చేసుకుందని, సాగర్‌ నగర్‌ దగ్గర బీచ్‌ను ఆనుకొని పది ఎకరాల స్థలాన్ని 33 ఏళ్ల లీజుకు ఇచ్చిందని అందులో పేర్కొన్నారు. బీచ్‌ రిసార్ట్‌ కడతామని ఆ సంస్థ చెప్పిందని అందులో తెలిపారు.

అయితే, ఈ ప్రాజెక్టు చేతులు మారిందని, నిర్వాహకులతో ఖరీదైన డీల్‌ చేసుకుని సగం వాటా మేఘాకు ఇచ్చారని తెలిపారు. రూ.250 కోట్ల భూమితో పాటు ప్రాజెక్టుపైనా అధికార పార్టీ పెద్దల కన్ను పడిందని ఆంధ్రజ్యోతిలో పేర్కొన్నారు. ఈ విషయాలనే దేవినేని ఉమ ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.

'విశాఖలో చేతులు మారిన మరో భారీ ప్రాజెక్టు కార్తీక దీపం.. తాళాలు వేసి పనులకు అడ్డంకులు.. కీలక నేతను కలిశాకే లైన్ క్లియర్.. నిర్వాహకులతో ఖరీదైన డీల్.. అస్మదీయ సంస్థకు సగంవాటా, కాకినాడ సెజ్, బందర్ పోర్ట్, కార్తీక దీపం వరుసగా ప్రాజెక్టులు చేతులు మారడంపై విచారణకు ఆదేశించే ధైర్యం ఉందా? వైఎస్ జగన్' అని దేవినేని ఉమ ప్రశ్నించారు. 

More Telugu News