Odisha: 22 కేజీల చేప.. రూ.1.43 లక్షలకు అమ్ముడుపోయి రికార్డు

  • ఓడిశాలోని భద్రక్‌లో మత్స్యకారుల వలకు చిక్కిన చేప
  • ఔషధాల తయారీలో వినియోగం 
  • సొంతం చేసుకున్న కోల్‌కతా వ్యాపారి
telia fish sold at Rs one and half lakh in Bhadrak

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఒడిశాలో ఓ చేపను ఓ వ్యాపారి ఏకంగా రూ.1.43 లక్షలకు కొనుగోలు చేశాడు. భద్రక్‌లోని తలచూవా ప్రాంతానికి చెందిన మత్స్యకారులకు ఇది సముద్రంలో దొరికింది.

 22 కేజీల బరువున్న ఈ చేపను స్థానికంగా ‘తెలియా’ అని పిలుస్తారు. సాధారణంగా సముద్రగర్భంలో నివసించే ఈ చేపలు ఇలా మత్స్యకారుల వలలకు చిక్కడం అరుదు. ఔషధాల తయారీలో దానిని వినియోగించడంతో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. చాందినిపల్లి చేపల మార్కెట్‌లో నిన్న ఈ చేపను వేలం వేయగా కోల్‌కతాకు చెందిన వ్యాపారి దీనిని రూ.1.43 లక్షలకు కొనుగోలు చేసినట్టు మత్స్యకారుడు తెలిపాడు.

More Telugu News