Visakhapatnam: ప్రహరీని కూల్చేస్తున్న అధికారులు.. సబ్బం హరి ఇంటి వద్ద ఉద్రిక్తత

GVMC Officials demolition Sabbam Hari house wall
  • సీతమ్మధారలోని హరి ఇంటి ప్రహరీని కూల్చేస్తున్న అధికారులు
  • ముందస్తు నోటీసు లేకుండా కూల్చివేతకు ఎలా వస్తారని సబ్బం ప్రశ్న
  • సమాధానం చెప్పకపోవడంతో నిరసనకు దిగిన హరి  
విశాఖపట్టణానికి చెందిన టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సీతమ్మధారలోని ఆయన ఇంటి ప్రహరీని ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే జీవీఎంసీ అధికారులు జేసీబీలతో కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది.

కూల్చివేతకు సంబంధించి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతకు ఎలా వస్తారని సబ్బం హరి అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు అధికారులు నిరాకరించడంతో హరి నిరసనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Visakhapatnam
Sabbam Hari
GVMC
TDP

More Telugu News