YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామ గంగిరెడ్డి మృతి

YS Jagan uncle Gangi reddy passes away in Hyderabad
  • గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి
  • పరిస్థితి విషమించడంతో గత రాత్రి కన్నుమూత
  • 2001-2005 మధ్య పులివెందుల ఎంపీపీగా పనిచేసిన గంగిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట విషాదం నెలకొంది. జగన్ మామ, ఆయన భార్య వైఎస్ భారతి తండ్రి అయిన ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. అనారోగ్యం బారినపడిన గంగిరెడ్డి గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పరిస్థితి విషమించడంతో గత అర్ధరాత్రి కన్నుమూశారు. పేదల వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న గంగిరెడ్డి 2001-2005 మధ్య పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. గంగిరెడ్డి మృతదేహాన్ని పులివెందులకు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
YS Jagan
YS Bharathi
Gangireddy
Passes away

More Telugu News