Tammineni Sitaram: గాంధీ మార్గాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్న నాయకుడు జగనే: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని

Jagan following Gandhis principles says Tammineni Sitaram
  • గాంధీకి అసలైన వారసుడు జగనే
  • వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడంపై విపక్షాలది అనవసర రాద్ధాంతం
  • ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు
ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ నివాళి అర్పించారు. గాంధీకి అసలైన వారసుడు జగనేనని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. మహాత్ముడు చూపిన మార్గాన్ని జగన్ తు.చ తప్పకుండా అనుసరిస్తున్నారని కొనియాడారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

జనం కడుతున్న ట్యాక్సులతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను నడిపిస్తోందని టీడీపీ అంటోందని... చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు జనాల నుంచి ట్యాక్సులు వసూలు చేయలేదా? అని తమ్మినేని ప్రశ్నించారు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు రాకుండా చంద్రబాబు అండ్ కో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని మండిపడ్డారు. గిరిజనులను గుర్తించిన ఏకైక నాయకుడు జగన్ అని ప్రశంసించారు.
Tammineni Sitaram
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Gandhi

More Telugu News